ఒక్క యూటర్న్ రెండు ప్రాణాలను తీసింది

by Sumithra |
ఒక్క యూటర్న్ రెండు ప్రాణాలను తీసింది
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై ఎదురేదురుగా వచ్చిన రెండు బైక్ లు ఢీకొని ఇద్ధరు వ్యక్తులు మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం డిచ్ పల్లి మండలం సుద్దపల్లి సీఎంసీ ఎదుట 44 జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న బైక్ ల పై డిచ్ పల్లి మండలం సుద్ధపల్లికి చెందిన అజయ్ (22), యానం పల్లికి చెందిన సాయులు అలియాస్ సామేల్ (52)లు ప్రమాదస్థలంలోనే మృతి చెందారు.

సీఎంసీ ఎదుట ఉన్న యూటర్న్ ను మూసివేయడంతో రాంగ్ రూట్లో రావడంతో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇద్దరు మృతుల్లో అజయ్ చదువుకుంటుండగా, సామేల్ వ్యవసాయం చేస్తు కుటుంబాన్ని పోశిషించుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు డిచ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Advertisement

Next Story

Most Viewed