ప్రాణం తీసిన రెండు వేల పెన్షన్..

by Shiva |
ప్రాణం తీసిన రెండు వేల పెన్షన్..
X

అన్నతమ్ముల గొడవలో అడ్డెళ్లిన బావ మృతి

దిశ, జగిత్యాల ప్రతినిధి : రెండు వేల పెన్షన్ డబ్బు కోసం ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవను వారించేందుకు వెళ్లిన బావ మృతిచెందిన దారుణ ఘటన జగిత్యాల పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం.. విజయపురి కాలనీలో నివసించే హయత్, తాజ్ ఇద్దరు అన్నదమ్ములు. వారి తల్లికి వృద్ధాప్య పెన్షన్ కింద ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.2వేలు వస్తుండగా ఆ మొత్తాన్ని అన్నదమ్ములు తీసుకుంటున్నారు. ఎప్పటిలాగే ఆ మొత్తం తీసుకునే క్రమంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. దీంతో గొడవను వారించేందుకు వారి బావ సయ్యద్ నయీం వెళ్లగా అన్నదమ్ములను ఆపే క్రమంలో కింద పడిపోయాడు. దీంతో సయ్యద్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

Advertisement

Next Story