వేరు వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు మృతి

by Anjali |
వేరు వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు మృతి
X

దిశ, హుజూరాబాద్: హుజూరాబాద్ పట్టణంలో జరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు మృతి చెందారు. వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి సైదాపూర్ క్రాస్ రోడ్డు వద్ద బుధవారం ఉదయం విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మామిండ్ల వాడకు చెందిన నల్గొండ సమ్మక్క (55) అక్కడికక్కడే మృతి చెందగా, రాచపల్లి రాజేశ్వరి అనే కార్మికురాలికి తీవ్ర గాయాలయ్యాయి. రాజేశ్వరిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేస్తున్నారు. కరీంనగర్ - వరంగల్ లోని ప్రధాన రహదారి ఎస్సారెస్పీ కెనాల్ వద్ద డీసీఎం వ్యాన్ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు మృతిని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story