ఒరిస్సా టు హైదరాబాద్ గంజాయి రవాణా..నిందితుల అరెస్ట్

by Aamani |   ( Updated:2024-09-24 11:36:49.0  )
ఒరిస్సా టు హైదరాబాద్ గంజాయి రవాణా..నిందితుల అరెస్ట్
X

దిశ, గూడూరు: అక్రమ సంపాదనే ధ్యేయంగా యువత చెడు దారి పడుతుందని మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి రావు అన్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు సోమవారం సాయంత్రం గూడూరు మండలం మచ్చర్ల గ్రామ స్టేజి వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహించారు.దానిలో భాగంగా 2 కార్లలో అక్రమంగా తరలిస్తున్న 1 క్వింటా 87 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు గూడూరు డీఎస్పీ తిరుపతి రావు తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో ఒరిస్సా రాష్ట్రం నుంచి భద్రాచలం మహబూబాబాద్ గూడూరు మీదుగా హైదరాబాద్ కి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారుగా రూ.46 లక్షల 76 వేల రూపాయల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మండల నరేష్ చత్తీస్ ఘడ్ కు చెందిన రాహుల్ మజుందార్, హరీష్ యాదవ్ బాపన్ లపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గంజాయి వలన యువత పాడైపోతున్నారని దానివల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడంలో ప్రజలు సహకరించాలని గంజాయి,డ్రగ్స్ గురించి ఎలాంటి సమాచారం అందిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు గంజాయి వినియోగం చేసిన రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న గూడూరు సిఐ బాబురావు ఎస్సై గిరిధర్ రెడ్డి, సిబ్బంది బిచ్చ నాయక్, కుమారస్వామి, రాజేష్, ప్రణీత్ అమ్రులను డీఎస్పీ తిరుపతిరావు అభినందించారు.

Advertisement

Next Story