పండగ పూట విషాదం

by Sumithra |
పండగ పూట విషాదం
X

దిశ, ఆమనగల్లు: ప్రజలందరు దసరా ఉత్సవాల్లో ఉండగా పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమనగల్లు మండల పరిధి చింతలపల్లి సమీపంలో కారు బైకు ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. వెల్డండా మండలం బర్కత్ పల్లి గ్రామానికి చెందిన కోడెల రామకృష్ణ (22), కడారి మల్లేష్ రోడ్డుప్రమాదంలో మరణించారు. దసరా పండుగ నేపథ్యంలో అత్తగారి ఇంటికి బర్కత్ పల్లి నుండి కేశంపేటకు బయలుదేరుతుండగా, మార్గమధ్యలో చింతలపల్లి సమీపంలో అతివేగంతో వస్తున్న కారు ఢీ కొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed