Tragedy: రాష్ట్రంలో మరో దారుణం.. అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ప్రేమ జంట బలవన్మరణం

by Shiva |   ( Updated:2024-12-03 03:57:11.0  )
Tragedy: రాష్ట్రంలో మరో దారుణం.. అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ప్రేమ జంట బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన గాజువాక (Gajuwaka) పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కిరెడ్డిపాలెం (Akkireddypalem)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమలాపురం‌ (Amalapuram) ప్రాంతానికి చెందిన పిల్లి దుర్గారావు (Durga Rao), సాయి సుష్మిత (Sai Sushmitha) కుటుంబాలు బతుకుదెరువు కోసం వలస వచ్చి షీలానగర్ (Shilanagar) ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీ (Venkateshwara Colony)లో నివాసం ఉంటున్నాయి.

ఈ క్రమంలోనే సుష్మిత, దుర్గారావుకు మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తాజాగా, తమ ఇళ్లలో పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వారు ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి దూకేశాడు. ఈ దుర్ఘటనలో దుర్గారావు, సుష్మిత అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కాలనీవాసుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed