ట్రాక్టర్, బైక్ ఢీ.. యువకుడికి తీవ్ర గాయాలు

by Shiva |
ట్రాక్టర్, బైక్ ఢీ.. యువకుడికి తీవ్ర గాయాలు
X

దిశ, చేర్యాల : ట్రాక్టర్, బైక్ ఢీకొని ఓ యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన చేర్యాల మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి మద్దూరు మండలం కూటీగల్ గ్రామానికి చెందిన కల్లాటి శ్రీకాంత్ చేర్యాల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న వివాహానికి హాజరయ్యాడు. శ్రీకాంత్ తిరిగి స్వగ్రామానికి బైక్ పై వెళ్తున్న క్రమంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆవరణలోని జాతీయ రహదారి మీదుగా సిద్దిపేట వైపు వెళ్తున్న వాటర్ ట్యాంకర్ బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ ట్రాక్టర్ క్రిందికి దూసుకెళ్లడంతో శ్రీకాంత్ కాలు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన అతడిని చేర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య చికిత్స కోసం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story