ట్రాక్టర్, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

by Shiva |
ట్రాక్టర్, బైక్ ఢీ.. వ్యక్తి మృతి
X

దిశ, చేగుంట : ట్రాక్టర్, బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చందాయిపేట్ గ్రామం మూలమలుపు వద్ద శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హవేలీ ఘనపూర్ మండలం ఫరీద్ పూర్ గ్రామానికి చెందిన పండ్ల కృష్ణ (38) తన అత్తగారి ఊరు పోతానుపల్లిలో జరుగుతున్న పెద్దమ్మ జాతరకు బైక్ పై బయలుదేరాడు. ఈ క్రమంలో కృష్ణ బైక్ చందాయిపేట మూలమలుపు వద్దకు రాగానే వేగంగా వస్తున్న ట్రాక్టర్ బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story