ఉరుములు, మెరుపులు.. అదే సమయంలో ట్రాక్టర్ కింద ఉండి ఫోన్ మాట్లాడిన యువకుడు మృతి.. అసలు ఏం జరిగిందంటే..?

by Kalyani |
ఉరుములు, మెరుపులు.. అదే సమయంలో ట్రాక్టర్ కింద ఉండి ఫోన్ మాట్లాడిన యువకుడు మృతి.. అసలు ఏం జరిగిందంటే..?
X

దిశ, బిజినపల్లి: సెల్ ఫోన్ మాట్లాడుతుండగా ఉరుములు మెరుపులు రావడం.. వర్షానికి ట్రాక్టర్ కింద ఉండి ఫోన్ మాట్లాడుతున్న ఓ యువకుడు మృతి చెందడంతో పాటు, అతని తండ్రి, బావకు తీవ్ర గాయాలు అయిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే వెలుగొండ గ్రామానికి చెందిన పాపగంటి నాగయ్య అనే రైతు కొంత పొలం కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. అతని కుమారుడు రమేష్ (26), అల్లుడు కృష్ణయ్య తదితరులతో కలిసి వరి కోత యంత్రాల ద్వారా వరి కోస్తుండగా ఆకస్మికంగా వర్షం ప్రారంభమైంది.

దీంతో వారు ట్రాక్టర్ కింద కూర్చున్నారు. ఈ సమయంలో రమేష్ కు ఫోన్ రావడంతో అతను ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్న సమయంలోనే ఒక్కసారిగా ఉరుములు మెరుపులు వచ్చాయి. ఫోన్ ద్వారా విద్యుత్ అయస్కాంత తరంగాలు ఒక్కసారిగా ప్రభావం చూపడంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని తండ్రి నాగయ్య, బావ కృష్ణయ్య గాయపడ్డారు. మరో ముగ్గురు ప్రమాదం నుండి బయటపడ్డారు.కాగా గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.

ఇది ఇలా ఉండగా ఈ ఘటనలో ఫోన్ డ్యామేజ్ కాకపోవడం.. ఫోన్ యాధావిధిగా పనిచేయడం, మృతుడి శరీరంపై గాయాలు గానీ, శరీరం నలుపు రంగుకు మారడం గానీ జరగకపోవడం విశేషం. అయితే సంఘటన స్థలానికి ఎక్కడో కొంత దూరంలో పిడుగు పడి ఆ సమయంలో మృతుడు ఫోన్ మాట్లాడుతుండడంతో విద్యుత్ అయస్కాంత తరంగాలు ప్రభావం చూపడం వల్లే ఈ సంఘటన జరిగిందని ప్రముఖ వైజ్ఞానిక శాస్త్ర నిపుణుడు శ్రీధర్ తెలిపారు. మృతునికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రెండు నెలల క్రితం నిర్వహించిన సామూహిక వివాహాలలో వివాహం జరిగింది.

Advertisement

Next Story

Most Viewed