- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Police Commissioner: ఇక నుంచి నగరంలో బెట్టింగ్ జరగనివ్వం

దిశ, వెబ్‌డెస్క్: బెట్టింగ్‌లకు పాల్పడే వారికి విశాఖ పోలీస్ కమిషనర్(Visakha Police Commissioner) బాగ్చి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరో ముగ్గురు క్రికెట్ బుక్కీలను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేయడంతో పాటు రూ.45 లక్షలు ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. త్వరలోనే బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నిందితులందరినీ గుర్తించి అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. క్రికెట్ బెట్టింగ్(Cricket Betting)లకు పాల్పడి యువత తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఇక నుంచి విశాఖ నగరంలో క్రికెట్ బెట్టింగులు జరుగనివ్వం అని చెప్పారు. బెట్టింగ్‌లకు పాల్పడే నిర్వాహకులను ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని, పట్టుకుని నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. విశాఖలో క్రికెట్ బెట్టింగ్‌తో ఆయా బ్యాంకు ఖాతాల నుంచి మొత్తంగా వీరు రూ.176 కోట్ల లావాదేవీలు నడిపినట్లు పోలీసులు గుర్తించారు.