- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
దిశ, భిక్కనూరు : 44వ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా అక్కన్న పేట గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ గౌడ్, ఎర్రం నవీన్, పిట్ల నవీన్ కామారెడ్డిలో పనులు ముగించుకొని ద్విచక్రవాహనంపై తిరిగు ప్రయాణం పట్టారు. సరిగ్గా భిక్కనూరు మండలం జంగంపల్లి సమీపంలో రాగానే బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా వారిని వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వీరిలో పవన్ కళ్యాణ్ గౌడ్ తలకు బలమైన గాయాలు తగిలి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా, మిగతా ఇద్దరు మాత్రం ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు భిక్కనూరు ఎస్సై ఆనంద్ గౌడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.