- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైలులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్టు
దిశ,సికింద్రాబాద్ : రైలులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను సికింద్రాబాద్ ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.12 లక్షల విలువ చేసే 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ కి చెందిన సైదులు(22), వెస్ట్ బెంగాల్ కు చెందిన సుమన్ సెన్ (22), ఎండీ. సోహెల్(24)లు విశాఖపట్నం వచ్చి బిల్డింగ్ కన్ స్ర్టక్షన్ పనులు , ఇతర కూలి పనులు చేస్తూ ఉన్నారు. వారు పనిచేసే దగ్గర విశాఖ పట్నానికి చెందిన ఆకాష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అప్పటికే ఆకాష్ గంజాయి విక్రయిస్తున్నాడు. కొన్నిప్యాకెట్లు ఇస్తాను వాటిని తీసుకువెళ్లి హైదరాబాద్లో ఇస్తే ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇస్తానని వారికి ఆశ చూపాడు.
డబ్బుకు ఆశపడిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ కు తీసుకువెళ్లేందుకు అంగీకరించారు. దీంతో ఒక్కొక్కరికి 20 కిలోల చొప్పున గంజాయి ప్యాకెట్లను ఇచ్చాడు. గంజాయి తీసుకున్న ముగ్గురు ఈ నెల 1న విశాఖపట్నంలో గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి బుధవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అప్పటికే గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంలో రంగంలోకి దిగిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గోదావరి ఎక్స్ప్రెస్ లో తనిఖీలు చేపట్టి అనుమానాస్పదంగా ఉన్న సైదులు, సుమన్ సేన్, సోహెల్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ప్రదీప్రావు, ఎస్ఐ బాలరాజు తెలిపారు. అరెస్టు చేసిన ముగ్గురిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించామని చెప్పారు. గంజాయిని ఈ ముగ్గురి ద్వారా నగరానికి చేరవేస్తున్న ఆకాష్ కోసం విశాఖపట్నంలో పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ గంజాయిని నగరంలో ఎవరికి అందజేస్తున్నారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆకాశ్ దొరికితే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
- Tags
- cannabis