ముచ్కుర్ లో దొంగల‌ హల్..చల్

by Shiva |   ( Updated:2023-05-20 11:44:03.0  )
ముచ్కుర్ లో దొంగల‌ హల్..చల్
X

10 తులాలు బంగారం, 76 తులాల వెండి చోరీ

దిశ, భీమ్‌గల్ : భీమ్‌గల్ మండల పరిధిలోని ముచ్కుర్‌‌ గ్రామంలో దోంగలు హల్‌చల్‌ చేశారు. ఎస్సై రాజ్ భరత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి గ్రామంలోని ఎగోళం గీతేశ్వర్ గౌడ్, శనిగరం నవీన్ రెడ్డి, పత్రి సుదర్శన్ అనే ముగ్గురు ఇళ్లలో దొంగలు వరుసగా చోరీకి పాల్పడ్డారు. ఎవరూ లేని ఇళ్లనే లక్ష్యంగా చేసుకున్న దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి 10 తూలాలు బంగారం, 76 తులాలు వెండి, కొంత నగదును ఎత్తుకెళ్లారు. తమ ఇళ్లలో దొంగతనం జరిగినట్లు భావించిన ఇంటి యజమానులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ద్వారా పరిసరాలను పరిశీలించారు. చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై రాజ్ భరత్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story