కారు దొంగతనం చేశారు... కానీ డ్రైవింగ్ రాకపోవడంతో ఏం చేశారంటే..!

by Javid Pasha |
కారు దొంగతనం చేశారు... కానీ డ్రైవింగ్ రాకపోవడంతో ఏం చేశారంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: విలాసాలకు అలవాటు పడ్డ ఓ ముగ్గురు దొంగలు రాత్రి వేళ ఇంటి ముందు పార్కు చేసిన ఓ కారును దొంగతనం చేశారు. అయితే ముగ్గురిలో ఏ ఒక్కరికీ డ్రైవింగ్ రాకోపోవడంతో ఒకరిమొఖాలు ఒకరు చూసుకున్నారు. అనంతరం వాళ్లు చేసిన పని తెలిస్తే షాకవడం ఖాయం. ఇంతకు ఏం జరిగిందంటే? ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన సత్యం కుమార్, అమన్ గౌతమ్, అమిత్ వర్మ అను ముగ్గురు యువకులు విలాసాలకు అలవాటు పడ్డారు. జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మే 7న ఓ ఇంటి ముందు పార్కింగ్ చేసిన మారుతీ వ్యాన్ ను దొంగలించేందుకు వెళ్లారు. ఎలాగోలా కారు అద్దాలు తెరిచి కారును స్టార్ట్ చేశారు. అయితే ఇంతలోనే ఒకిరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అందుకు ప్రధాన కారణం ఆ ముగ్గురిలో ఏ ఒక్కరికీ కారు నడపడం రాదు. దీంతో వారు వాహనంలో నుంచి బయటకు వచ్చి కారు నెంబర్ ప్లేట్ తొలగించారు. అనంతరం ఆ కారును తోసుకుంటూ 10 కిలోమీటర్ల దూరం వెళ్లారు.

అయితే అంత దూరం కారును తోసుకుంటూ వెళ్లడంతో అలిసిపోయిన దొంగలు.. ఇక తమ వాళ్ల కాదంటూ ఆ కారును ఓ నిర్మానుష్య ప్రదేశంలో వదిలిపెట్టి వెళ్లారు. కారు ఓనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను పట్టుకున్నారు. ఈ దొంగతనానికి అమిత్ సూత్రధారి కాగా మిగతా ఇద్దరూ అతడిని ఫాలో అయినట్లు ఏసీపీ భెజ్ నారాయణ్ సింగ్ తెలిపారు. కారును దొంగలించాక ఓ వెబ్ సైట్ ద్వారా విక్రయించేందుకు నిందితులు ప్రయత్నించారని, కానీ డ్రైవింగ్ రాకపోవడంతో కారును వదిలేసి వెళ్లిపోయారని ఏసీపీ చెప్పారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు పంపినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story