- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల అరెస్ట్..
దిశ,భైంసా : సహజీవనం చేస్తు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న జంటని పట్టుకొని రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు.మంగళవారం బైంసా పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నిందితుల గురించి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.పట్టణంలోని శాస్త్రి నగర్ కు చెందిన పులి ప్రదీప్(37) గత రెండు సంవత్సరాల క్రితం తనకు పరిచయమైన భైంసా కు చెందిన కొడాలి వెంకట లక్ష్మి తో సహజీవనం చేస్తూ,సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు.ఈ నెల 22 తేదీ ఆదివారం రాత్రి కుబీర్ మండలం పార్టీ-బి గ్రామం లో ఉన్న రాజరాజేశ్వర దేవాలయం లో దొంగతనం చేయాలని పథకం పన్ని సోమవారం ఉదయం అందాజ ఒంటి గంటకు కారు నెంబర్ TS16FD0980 లో వెళ్ళి దేవాలయం తాళం బద్దలు కొట్టి,అందులో ఉన్న డబ్బులను తీసుకోని అక్కడి నుండి కుబీర్ మీదుగా చొండి గ్రామం లో గల దత్త సాయి టెంపుల్ లో దొంగతనం చేయాలని నిశ్చయించుకుని ఆలయంలో ప్రవేశించగా అక్కడ ఏమి కనబడక పోవడం తో బయట ఉన్న గ్యాస్ సిలిండర్ ను దొంగలించి మహారాష్ట్ర కి పరారయ్యారు.
మహారాష్ట్ర లోని భోకర్ లో తమ కార్ నీ రిపేర్ చేయించుకుని,దొంగతనం చేసినడబ్బులను జల్సాలకు వాడుకొని తిరిగి భైంసా వస్తుండగా కుబీర్ మండల కేంద్ర శివారులో నిందితులను కుబీర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా గత కొంత కాలంగా నిర్మల్ జిల్లాలోని కుబీర్, బైంసా,ముధోల్, బాసర, నర్సాపూర్ (జి) మండలంలో దొంగతనాలు చేస్తున్నట్లు నేరం ఒప్పుకున్నారు. ఇప్పటివరకు నిందితులపై వివిధ స్టేషన్ లలో 8 కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు.నిందితులను పట్టుకోవడంలో భైంసా రూరల్ సిఐ నైలు, కుబీర్ ఎస్సై రవీందర్,ఏఎస్ఐలు రాందాస్,దేవ్ రావు కానిస్టేబుల్ దీపక్ సింగ్, చాకచక్యంగా వ్యవహరించినందుకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారని తెలిపారు.ప్రస్తుతం నిందితుల వద్ద దాదాపు పదివేల పైనే డబ్బులు రికవరీ చేశామని, మిగతాది రికవరీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే దొంగిలించిన చోట్ల దొరికిన బంగారు ఆభరణాలపై రుణాలు సైతం తీసుకున్నారని తెలిపారు.