లాడ్జిలో యువకుడు మృతి.. ఇది హత్యా? ఆత్మహత్యా?

by samatah |
లాడ్జిలో యువకుడు మృతి.. ఇది హత్యా? ఆత్మహత్యా?
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో : అనుమానస్పద పరిస్థితుల్లో ఓ యువకుడు చనిపోయాడు. ఈ సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓల్డ్ అల్వాల్ నివాసి జి. శ్రీకాంత్ దూలపల్లి లో ఉన్న బజాజ్ సర్వీస్‌లో క్యాషియర్ గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి అల్వాల్ సాయిబాబా నగర్‌లో ఉన్న ఓయో లాడ్జి 430 నెంబర్ రూమ్ లో అతని మృతదేహం సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. అతను ఆత్మహత్య చేసుకున్నాడా? వేరే కారణాలు ఉన్నాయా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

Next Story