- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడేళ్ల కూతురితో 12 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకిన పోలీస్ భార్య
దిశ, వెబ్‌డెస్క్: భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. కానీ, కొంత మంది భర్తలు.. భార్యలను వేధింపులకు గురిచేస్తుంటారు. ఈ వేధింపులు ఎక్కువైతే.. మొదట బంధువులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. అయినా మారకపోతే పోలీసులను ఆశ్రయిస్తారు. తమకు న్యాయం చేయాలని మొర పెట్టుకుంటారు. కానీ, పోలీసు భర్తే వేధిస్తే.. ఆ భార్య న్యాయం కోసం ఎటు వెళ్లాలో తెలియక తన మూడేళ్ల కూతురితో 12 అంతస్తుల బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
అహ్మదాబాద్‌లోని గోటా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో 12వ ఫోర్‌లో కుల్దీప్ సిన్హ్.. తన భార్య, మూడేళ్ల కూతురితో నివాసం ఉంటున్నాడు. వృత్తిరిత్య కుల్దీప్ కానిస్టేబుల్. ఈ దంపతులు తరచూ గొడవలు పడేవారు. వీరు కింద ఫ్లోర్‌లో ఉండే కుల్దీప్ బంధువులు వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసేవారు. అయినా కుల్దీప్‌లో ఎటువంటి మార్పు రాలేదు. తరచూ భార్యను హించించేవాడు. ఆమెను సూటిపోటి మాటలతో మనోవేదనకు గురిచేసేవాడు. ఇలా భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక కుల్దీప్ భార్య వారు ఉండే 12వ ఫ్లోర్ నుంచి తన మూడేళ్ల కూతురితో దూకి అత్మహత్య చేసుకుంది. దీనిని గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. కాగా, బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
Also Read : అర్ధరాత్రి నడిరోడ్డుపై మెడికల్ స్టూడెంట్‌పై పోలీస్ అత్యాచారం..