మైనర్ బాలిక పై అత్యాచారం.. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు..

by Sumithra |   ( Updated:2023-06-02 17:17:08.0  )
మైనర్ బాలిక పై అత్యాచారం.. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు..
X

దిశ, రాజేంద్రనగర్ : గ్రేట్ హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలిక పై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయమై బాధిత బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్ర షోలాపూర్ ప్రాంతానికి చెందిన బాధిత బాలిక కుటుంబం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబన్ కాలనీలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నిందితుడి కుటుంబం కూడా బ్రతుకుదెరువు కోసం నగరానికి చేరుకొని మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబన్ కాలనీలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. బాధిత బాలిక నిందితుడి కుటుంబాలు నివసిస్తున్న ఇల్లు పక్కపక్కనే కావడంతో ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడింది.

ఈ నేపథ్యంలోనే నిందితుడు బాధిత బాలికతో పరిచయం పెంచుకున్నాడు. గత ఏడాదికాలంగా వారిద్దరి మధ్యన స్నేహం కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే నిందితుడు బాధిత బాలికను ఇంటి నుండి తీసుకువెళ్లి ఇంటి వెనక వైపునే ఉన్న మరోగదిలో ఉంచి అత్యాచారం చేశాడు. బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా ఇంటి వెనకనే ఉన్న మరో గదిలోనే నిందితుడు ఉంచినట్లు గుర్తించి బాలికను ఇంటికి తీసుకొని వచ్చారు. అత్యాచారం చేసిన విషయం బాలిక ద్వారా తెలుసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక పై అత్యాచారం జరిగిన విషయంలో ఇరుకుటుంబాల మధ్య ఘర్షణ సైతం జరిగింది. నిందితుడి కుటుంబ సభ్యులు బాలిక కుటుంబ సభ్యులను ఫిర్యాదు చేయవద్దంటూ బెదిరించారని బాదిత బాలిక కుటుంబ సభ్యులు చెప్తున్నారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మైలర్ దేవుపల్లి పోలీసులు. కాగా నిందితుడి వయసు విషయంలో పూర్తివివరాలు తెలియలేదని నిందితుడు మైనరా లేక మేజరా అన్న విషయం తెలిసిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని మైలార్ దేవుపల్లి సీఐ మధు తెలిపారు.

Advertisement

Next Story