కట్ట కృష్ణకు రిమాండ్...ఆ కేసులోనే...!

by Shiva |   ( Updated:2023-05-10 12:23:19.0  )
కట్ట కృష్ణకు రిమాండ్...ఆ కేసులోనే...!
X

దిశ, నాగిరెడ్డిపేట్ : మండల పరిధిలోని రామక్కపల్లి గ్రామంలో 6న గ్రామానికి చెందిన కట్ట భూమయ్య అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం చేసిన దొంగను పట్టుకుని రిమాండ్ కు తరలించినట్లు స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపారు. వివరాల్లోకి వెళితే... రామక్కపల్లి గ్రామానికి చెందిన కట్ట కృష్ణ అనే యువకుడు కట్ట భూమయ్య ఇంట్లో మద్యాహ్నం ఎవరు లేని సమయంలో దొంగతనానికి పాల్పడి రూ.6వేల నగదు దోచుకెళ్లినట్లు తెలిపారు. కట్ట భూమయ్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కృష్ణ అనే వ్యక్తి దొంగతనానికి పాల్పడినట్లుగా విచారణలో తేలిందన్నారు. నిందితుడి దగ్గర నుంచి రూ.6 వేల నగదును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

Advertisement

Next Story