నరబలి కేసులో విస్తుపోయే నిజాలు.. చంపిన తర్వాత శరీరాలను పీక్కుతిన్న ముగ్గురు

by Mahesh |
నరబలి కేసులో విస్తుపోయే నిజాలు.. చంపిన తర్వాత శరీరాలను పీక్కుతిన్న ముగ్గురు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్దిక ఇబ్బందులు తొలుగుతాయని మూడనమ్మకాలతో ఇద్దరు మహిళను నరబలి ఇచ్చిన ఘటన కేరళ రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. త్వరితగతిన కేసు విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు నిందితులను ఆరాతీయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నరబలి ఇచ్చిన ఇద్దరు మహిళల శరీరాలను రేస్లీ శరీరాన్ని 56 ముక్కలుగా, పద్మ శరీరాన్ని 5 ముక్కలుగా చేశారు.

అయితే శరీర బాగాలను పాతి పెట్టడానికి ముందు దంపతులు ఇద్దరూ మరో వ్యక్తితో కలిసి మహిళల శరీర భాగాలు పిక్కుతిన్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసుల వారిని ఎర్నాకుళం కోర్టులో ప్రవేశ పెట్టారు. అనంతరం ముగ్గురు నిందితులను 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. కాగా ఈ నరబలి జూన్ 8, సెప్టెంబర్ 25న సా. 6 గంటల సమయంలో నరబలి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.‌

Advertisement

Next Story