Gachibowli: న్యూ ఇయర్ వేళ హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం

by Gantepaka Srikanth |
Gachibowli: న్యూ ఇయర్ వేళ హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తోన్న వేళ హైదరాబాద్‌లో డ్రగ్స్(Drugs) కలకలం రేపాయి. గచ్చిబౌలిలోని క్వాక్ అరెనా పబ్‌(Kwak Arena Pub)లో డ్రగ్స్ వాడుతున్నారని వచ్చినా పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం నార్కోటిక్ పోలీసులు(Narcotics Bureau) తనిఖీలు నిర్వహించారు. పబ్‌కు వచ్చిన కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం టెస్టులు చేయగా.. 8 మందికి పాజిటివ్ వచ్చింది. అనంతరం పోలీసులు మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ టెస్టుల కోసం అత్యుధునిక పరికరాలు యూజ్ చేస్తున్నట్లు తెలిపారు.

చట్టం ముందు అందరూ సమానమే అని అన్నారు. పార్టీల్లో డ్రగ్స్ యూజ్ చేసినా, సరఫరా చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎప్పుడు ఎక్కడ తనిఖీ చేస్తామో తెలియదు. తనిఖీల సమయంలో డ్రగ్స్ పట్టుబడితే అప్పుడు తామేంటో చూపిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే తప్పకుండా పోలీసులకు తెలియజేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పబ్‌లపై నిఘా పెట్టినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed