కాలాపత్తర్లో కార్డన్ సెర్చ్

by Javid Pasha |
కాలాపత్తర్లో కార్డన్ సెర్చ్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: హైదరాబాద్ పాతబస్తీలో మంగళవారం అర్ధరాత్రి దాటాక పోలీసులు కార్డన్ సెర్చ్ జరిపారు. దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య నేతృత్వంలో లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, సీసీఎస్ జోనల్ టీం, నార్కోటిక్ వింగ్ కు చెందిన 250 మంది పోలీసులు ఈ సెర్చ్ లో పాల్గొన్నారు. రాత్రి 12 గంటలకు మొదలై తెల్లవారుజాము 3 గంటల వరకు సాగిన కార్డన్ సెర్చ్ లో మొత్తం 250 ఇళ్లల్లో తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో సరైన పత్రాలు లేని మూడు ఆటోలతో సహా నలభై ఒక్క వాహనాలను సీజ్ చేసారు. పదిహేను మంది రౌడీషీటర్లు, ఏడుగురు సస్పెక్ట్ షీటర్లను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అనంతరం వీరికి కౌన్సెలింగ్ జరిపారు. నేరాల బాట విడిచి పెట్టారా? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మళ్లీ నేరాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీసీపీ సాయి చైతన్య వారిని హెచ్చరించారు. అదేవిధంగా ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్నవారిపై జారీ అయి ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లను సర్వ్ చేసారు. ఈ సందర్బంగా డీసీపీ సాయి చైతన్య మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు ముఖ్యంగా వైట్నర్ సేవించి న్యూసెన్స్ చేసే వారి గురించి తెలిస్తే వెంటనే 100 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed