దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

by Shiva |
దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
X

2.5 తులాల బంగారం, 6 తులాల వెండి, రూ.5 వేల నగదు స్వాధీనం

దిశ, కోరుట్ల టౌన్ : రహీంపురా, ఆదర్శ్ నగర్ కాలనీలో ఈ నెల 11న తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని కోరుట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోరుట్ల సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కోరుట్ల పట్టణంలో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్శ్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న పట్టణానికి చెందిన ఎండీ ముజహీద్ ను అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు.

అతడి వద్ద నుంచి 2.5 తులాల బంగారం, 6 తులాల వెండి, రూ.5 వేల స్వాధీనం చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన వెల్లడించారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై చిర్ర సతీష్, సిబ్బంది కానిస్టేబుల్ సత్తయ్య, ఎల్లయ్యను సీఐ ప్రవీణ్ కుమార్ అభినందించారు. దొంగతనలను అరికట్టడంలో సీసీ కెమెరాలు ఎంతగానో తోడ్పడుతాయని, వాటిలో దొగలను సులభంగా పట్టుకొవచ్చని తెలిపారు. అందరూ ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story