వ్యక్తి అదృశ్యం..

by Kalyani |
వ్యక్తి అదృశ్యం..
X

దిశ, మేడిపల్లి: వ్యక్తి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి మండల పరిధి చెంగిచెర్ల క్రాంతి కాలనీ రోడ్ నెంబర్ 4 లో నివాసం ఉంటున్న ముసపట్ల ప్రవీణ్(29) గత నెల 30 వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు.

కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించ లేదు. దీంతో ప్రవీణ్ భార్య దీప మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతని గురించి ఎటువంటి ఆధారాలు లభించిన మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ అనిల్ కుమార్ కోరారు.

Advertisement

Next Story