ఆపరేషన్ కు రూ. 5 లక్షలు ఖర్చవుతుందని..

by Sridhar Babu |   ( Updated:2025-03-11 15:59:40.0  )
ఆపరేషన్ కు రూ. 5 లక్షలు ఖర్చవుతుందని..
X

దిశ, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలోని భూషణ గట్ల సమీపంలో హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామానికి చెందిన నరసింహాచారి (53) అనే వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జనవరి 7న హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా మెడ నరాల సమస్య ఉందని ఆపరేషన్ కు రూ. 5 లక్షల ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు.

అదే విషయాన్ని మనసులో పెట్టుకొని జనవరి 8న ఇంట్లో నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడని హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు మృతుని అల్లుడు ఓంప్రకాష్ తెలిపారు. కాగా సోమవారం ఆకునూరు గ్రామ శివారులోని భూషణ గట్ల సమీపంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా నరసింహాచారిగా గుర్తించారు. మృతుడి అల్లుడు ఓం ప్రకాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సైదాపూర్ ఎస్సై సీహెచ్. తిరుపతి తెలిపారు.

Next Story