అదుపుతప్పి డివైడర్ ఎక్కిన లారీ

by Shiva |
అదుపుతప్పి డివైడర్ ఎక్కిన లారీ
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : లారీ అదుపుతప్పి డివైడర్ ఎక్కిన ఘటన జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ నుంచి పెద్దపల్లి వైపు వెళ్తున్న లారీ శనివారం తెల్లవారుజామున అదుపుతప్పి జిల్లా కేంద్రంలోని నటరాజ్ చౌరస్తా వద్ద డివైడర్ పైకి దూసుకెళ్లింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందంటూ పోలీసులు తెలిపారు. నిజామాబాద్, జగిత్యాల జాతీయ రహదారి పై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ కి కాస్త అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో లారీని డివైడర్ మీది నుంచి కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Next Story