కూతురికి ఉద్యోగం వచ్చిందన్న ఆనందం.. అంతలోనే విషాదం..

by Aamani |
కూతురికి ఉద్యోగం వచ్చిందన్న ఆనందం.. అంతలోనే విషాదం..
X

దిశ, సూర్యాపేట టౌన్ : కూతురికి ఉద్యోగం వచ్చిన ఆనందం ఆ తండ్రికి ఎక్కువసేపు మిగల్చలేదు. కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందిన సంఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 5 వార్డ్ వస్త్రం తండాకు చెందిన బానోతు బాబు నాయక్ (50) సువెన్ ఫ్యాక్టరీలో పని చేస్తుంటారు. బాబు నాయక్ కు అమ్మాయి, అబ్బాయి ఉండగా అమ్మాయి సోమవారం కానిస్టేబుల్ గా అర్దర్ తీసుకొని గరిడేపల్లి పోలీస్ స్టేషన్ లో మంగళవారం విధుల్లోకి చేరింది.

అయితే మంగళవారం బాబు సోదరి తుల్జా రావు పేట లో పండగ చేస్తుండగా హాజరయ్యేందుకు ఫ్యాక్టరీలో పనులు ముగించుకొని తుల్జారావుపేటకి బయలుదేరగా మార్గ మధ్యంలోని ఎన్ హెచ్ 65 శాంతి నగర్ ఎఫ్సీఐ గోదాం వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాబు నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ హాస్పిటల్ కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed