తలలేని మొండాన్ని ఇంటి బయట ఉంచి.. హాయిగా నిద్రపోయిన డ్రైవర్

by Anjali |
తలలేని మొండాన్ని ఇంటి బయట ఉంచి.. హాయిగా నిద్రపోయిన డ్రైవర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో సినిమాల్లో మాదిరిగానే బయట సమాజంలో కూడా హత్యల విషయంలో అతి కిరాతకంగా వ్యవహరిస్తు్న్నారు. మృతదేహాన్ని కాళ్లు, చేతులు, తల నరకడం.. ముక్కలుగా చేయడం లాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే (మే 22) ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం, సారంగడ్ బిలాయి గఢ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

శంకర్ సాహూ అనే వ్యక్తి సర్సివా ప్రాంతంలో కార్గో ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. మృతదేహం నుంచి తలను వేరు చేసి, సోమవారం రాత్రి తలలేని మొండాన్ని ట్రక్కులో వేసుకుని తన సొంత గ్రామానికి వెళ్తున్నాడు. అయితే దారిమధ్యలో కొంతమంది ట్రక్కులో ఉన్న మొండాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే నిందితుడి ఇంటికి చేరుకోగా.. మృతదేహాన్ని ట్రక్కులోనే ఉంచి, ఇంట్లో హాయిగా నిద్రపోయాడు. ఈ ఘటనపై సర్శివా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం నిందితుడు ఆ వ్యక్తిని ‘ఎందుకు చంపాడు, తల ఎక్కడ పెట్టాడు, హత్య చేసింది ఎవరిని’ అనే దానిపై దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story