- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుక్క దారుణ హత్య.. మార్నింగ్ వాక్ కు వెళ్తుండగా ఘటన
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో కుక్కలు వ్యక్తులపై దాడి చేయడం చూస్తున్నాం..కానీ కుక్కపై ఒక వ్యక్తి దాడి చేయడం అందర్ని ఆశ్యర్యానికి గురి చేస్తుంది. విషయమేంటంటే... యజమానితో కలిసి వెళుతున్న ఆడ పిట్‌బుల్(కుక్క)ను ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో పొడిచి చంపిన ఘటన గురువారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. తీవ్రంగా రక్తస్రావం కావడంతో కుక్క చనిపోయింది. తన యజమానితో కలిసి నడుచుకుంటూ వెళుతున్న ఆడ పిట్‌బుల్‌పై ఓ వ్యక్తి వెనకనుంచి పదునైన ఆయుధంతో దాడి చేశాడు. యజమాని వెంటనే కుక్కను వెటర్నరీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా... తీవ్ర గాయం కావడంతో చనిపోయిందని తెలిపడంతో ఆ యజమాని బోరున విలపించాడు. దీనికి కారణమైన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికంగా ఉన్న చార్తావాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ‘‘నేను ఉదయం కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లాను. రవి కుమార్ అనే వ్యక్తి నా పెంపుడు జంతువుపై వెనుక నుండి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిందని ఆ కుక్క యజమాని నితిన్ పాండే తెలిపారు. వెంటనే పోలీసులు కుక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 429, 506 కింద కేసు నమోదు చేసి, ప్రస్తుతం నిందితుడి కోసం వెతుకుతున్నారు.