- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Crime News :నగ్న చిత్రాల డాక్టర్.. ప్రియురాలి సెక్స్ వీడియోలతో సోషల్ మీడియా షేక్
దిశ, వెబ్‌డెస్క్ : అతడో బాధ్యత కలిగిన డాక్టర్. ప్రాణానికన్న ఎక్కువగా ప్రేమించిన యువతిని పెళ్లాడటానికి సిద్ధమయ్యాడు. కానీ అతడి వక్ర బుద్ధితో కాబోయే భార్య చేతిలోనే హతమయ్యేలా చేసింది. తాను తాళి కట్టబోయే భార్య అని తెలిసినా.. ఆమె నగ్న దేహాన్ని బజారున పెట్టి మృతదేహంగా మారాడు. ప్రియుడు.. కాబోయే భర్త తన పరువు తీయడంలో స్నేహితులతో కలిసి అతడిని మట్టుబెట్టింది ఆ ప్రియురాలు. బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
27 ఏళ్లున్న డాక్టర్ వికాస్‌ది బెంగళూరు. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వికాస్.. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ) కోసం బెంగళూర్‌లోనే కోచింగ్ తీసుకుంటున్నాడు. వికాస్ రెండేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. వీరిద్దరి ప్రేమ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆ జంటకు నిశ్చితార్థం కూడా చేశారు. పెళ్లి చేసుకోబోతున్నామని ఈ జంట ఏకాంతంగా రొమాన్స్ చేసింది. అలా వీలు చిక్కినప్పుడల్లా వీరిద్దరు శృంగారంలో పాల్గొన్నారు. అయితే ప్రియురాలికి తెలియకుండా వికాస్ వారి సెక్స్ వీడియోలను రహస్యంగా రికార్డ్ చేశాడు. అంతటితో ఆగకుండా తన ఫ్రెండ్ పేరుతో సోషల్ మీడియాలో ఖాతా తెరిచి ఆ యువతి న్యూడ్ ఫొటోలు, వీడియోలను అందులో పోస్ట్ చేశాడు. ఆపై తమిళనాడులోని తన స్నేహితులకూ షేర్ చేశాడు. సెప్టెంబర్ 8న ఈ బూతు బాగోతాన్ని గుర్తించిన యువతి వికాస్‌తో గొడవ పడింది. ఎందుకు అలా చేశావని నిలదీసింది. అయితే కేవలం వాటిని చూసి ఆనందించడానికి న్యూడ్ ఫొటోలను తీసి, పోస్ట్ చేశానని ప్రియుడు చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురైంది.
వికాస్‌కు తగిన గుణపాఠం చెప్పాలనుకున్న యువతి.. తన క్లాస్‌మేట్ సుశీల్‌కు జరిగిన విషయం మొత్తం చెప్పింది. అతడు మరో ఇద్దరు స్నేహితులైన గౌతమ్, సూర్యలతో కలిసి కొట్టి పంపించాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ పధకంలో భాగంగా ఈ నెల 10న వికాస్‌ను మైకో లేఅవుట్‌లోని తన ఇంటికి తీసుకెళ్లాడు సుశీల్. ఆ తర్వాత అందరూ కలిసి అతడిపై దాడి చేశారు. అనంతరం వికాష్‌ను ఆస్పత్రిలో చేర్పించి వెళ్లిపోయారు. అక్కడ నాలుగు రోజులు చికిత్స పొందిన వికాస్.. ఆస్పత్రిలోనే సెప్టెంబర్ 14న మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వికాస్ ప్రియురాలితోపాటు ఆమె ఇద్దరు స్నేహితులు సుశీల్, గౌతమ్‌లను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు సూర్య పరారీలో ఉన్నాడు.
Also Read: ఓయో రూమ్స్‌లో వ్యభిచార రాకెట్.. తనిఖీల్లో బట్టబయలు
- Tags
- Crime News Today