- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కాలిన స్థితిలో మరో మృతదేహం లభ్యం..
by Sumithra |
X
దిశ, చిన్నశంకరంపేట : మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి గుట్ట వద్ద చేగుంట- మెదక్ రోడ్డు పై ఉన్న బస్టాండ్ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమయింది. గుర్తుతెలియని దుండగులు వ్యక్తి పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ఉంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై నారాయణ గౌడ్ తన సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపడుతున్నారు.
గత నెల 23 తేదీన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెనకాల ఉన్న డోర్ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తిని పెట్రోల్ పోసి నిప్పంటిన సంగతి విధితమే. కాగా వారం రోజుల్లో మరో వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు నిప్పంటించినట్లు ఆదివారం మండల కేంద్రంలో చోటు చేసుకోవడం పట్ల ఇక్కడ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Advertisement
Next Story