అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ పొడిగింపు

by Javid Pasha |
అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ పొడిగింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీని పొడిగిస్తూ సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అరెస్టైన పిళ్లై జ్యూడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఈరోజు ఉదయం ఆయనను సీబీఐ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో ఏప్రిల్ 17 వరకు జ్యూడిషియల్ కస్టడీని పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో పిళ్లైను మార్చి 7న ఈడీ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో జరిగిన అవకతవకలపై అరుణ్ పిళ్ళైను ఈడీ ప్రశ్నించింది. అనంతరం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా మార్చి 13 వరకు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కస్టడీ ముగిసిన తర్వాత మరోసారి మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఈడీ అధికారులు కోరాగా అందుకు కోర్టు అనుమతించింది. ఇది కూడా ముగియడంతో అధికారులు ఆయను స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. దీంతో పిళ్లైకు ఏప్రిల్ 3 వరకు జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, నేటితో జ్యూడిషియల్ కస్టడీ ముగియడంతో సీబీఐ కోర్టుకు తీసుకురాగా, పిళ్లైకు సీబీఐ కోర్టు ఏప్రిల్ 17 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది.

Advertisement

Next Story