రైలు పట్టాల పక్కన నలుగురు పురుషులు, మహిళ మృతదేహాలు లభ్యం

by Mahesh |
రైలు పట్టాల పక్కన నలుగురు పురుషులు, మహిళ మృతదేహాలు లభ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: రైలు పట్టాల పక్కన నలుగురు పురుషులు, ఒక మహిళా మృతదేహాలు లభ్యమైన ఘటన మంగళవారం మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో చోటు చేసుకుంది. దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. దాదాపు అన్ని మృతదేహాలకు గాయాల గుర్తులు ఉన్నాయని పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఇంతకి వారు ఎలా మృతి చెందారు.. ప్రమాదం వల్ల జరిగిందా.. లేదా ఆత్మహత్య చేసుకున్నారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ఈ మృతదేహాలు వేర్వేరు చోట్ల లభ్యం అవ్వడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. శికర్‌పురా రైల్వే క్రాసింగ్‌ సమీపంలో ఒక పురుషుడు, మహిళ మృతదేహాలు, తుస్సిపురా వద్ద పట్టాల సమీపంలో ఒక వ్యక్తి మృతి చెందగా, ఉత్తమ్‌పుర వద్ద మరో ఇద్దరు పురుషుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం.. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed