- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీస్ కస్టడీలో షాకింగ్ విషయాలు బయటపెట్టిన అతిక్ హంతకులు
దిశ, వెబ్ డెస్క్: యూపీకి చెందిన గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ ను శనివారం కొందరు దుండగులు రివాల్వర్లతో కాల్చి హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా గ్యాంగ్ స్టర్ ను, అతడి సోదరుడిని హత్య చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు విచారణ చేపట్టారు. కాగా పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ తో తమకు ఎలాంటి శత్రుత్వం లేదని, పాపులారిటీ కోసమే వాళ్లిద్దరిని చంపామని నిందితులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు ప్రయాగ్ రాజ్ పోలీస్ కమిషనర్ రమిత్ శర్మ తెలిపారు. అతిక్, అష్రఫ్ అరెస్ట్ అయిన విషయం తెలియగానే వాళ్లను చంపాలనుకున్నామని, అందుకోసం జర్నలిస్టుల అవతారం ఎత్తామని నిందితులు చెప్పినట్లు పేర్కొన్నారు. అతిక్, అష్రఫ్ లను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తుండగా ప్రయాగ్ రాజ్ వద్ద విలేకర్ల ముసుగులో వచ్చిన నిందితులు రివాల్వర్లతో కాల్చి చంపినట్లు కమిషనర్ వెల్లడించారు.