- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి..
by Sumithra |

X
దిశ, నిజామాబాద్ క్రైం : నగరంలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని రైల్వేస్టేషన్ ప్రాంతంలో సుమారు (40) సంవత్సరాలు గల వ్యక్తి అధిక మోతాదులో మద్యం సేవించడం లేదా వడదెబ్బతో మృతి చెంది ఉంటాడని 1వ టౌన్ ఎస్హెచ్వో విజయ్ బాబు తెలిపారు.
ఈ మేరకు అనుమానాస్పద మృతి కేసునమోదు చేసి మృతదేహాన్ని మార్చురీ గదికి తరలించినట్లు తెలిపారు. అతని వద్ద వివరాలు లేవని, ఒరిస్సా, బీహారి వాసి అయి ఉంటాడని అనుమానాలున్నాయన్నారు. అతని గురించి తెలిసిన వారు పోలీస్ స్టేషన్ లో గానీ, జిల్లా ఆసుపత్రిలో గాని సంప్రదించాలని కోరారు.
Next Story