suicide : ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

by Sridhar Babu |
suicide : ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
X

దిశ, కుబీర్ : కుబీర్ మండలంలోని న్యూ సాంవ్లీకి చెందిన భారతబాయ్(32) అనే మహిళ వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై పి. రవీందర్ తెలిపారు. శనివారం ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భర్త దయానంద్, మరిది కీర్తిరతన్ వేధింపుల వల్ల చనిపోయినట్టు తెలిపారు. మృతురాలి అన్న సాంగే ప్రకాష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలున్నారు.

Advertisement

Next Story

Most Viewed