Telugu Crime News : నా చావుకు వాళ్లే బాధ్యులు

by Sridhar Babu |   ( Updated:2024-10-26 10:48:53.0  )
Telugu Crime News :  నా చావుకు వాళ్లే బాధ్యులు
X

దిశ, బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఇరవెండి గ్రామపంచాయతీకి చెందిన గిరిజన మహిళా రైతు నూక రత్తమ్మ (Nuka Rattamma) శనివారం పురుగుల మందు డబ్బా చేతబూని ఆత్మహత్యాయత్నానికి (suicide attempt) పాల్పడింది. సారపాకలోని ఐటీసీ యాజమాన్యం శుక్రవారం అర్ధరాత్రి తమ పొలంలో పైప్ లైన్ వేస్తుండగా రత్తమ్మ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన రత్తమ్మపై వంశీ, కోర్సా లక్ష్మి, ఐటీసీ యాజమాన్యం దౌర్జన్యానికి దిగి మీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరించారని బాధితురాలు తెలిపారు.

ఆరు నెలలుగా తమ పొలంలో పైప్ లైన్ (Pipe line)వేయకుండా ఆపుతున్నా ఐటీసీ యాజమాన్యం తమకు ఎటువంటి న్యాయం చేయకుండా దౌర్జన్యంగా పైప్లైన్ వేస్తున్నారని, నష్టపరిహారంపై ఐటీసీ యాజమాన్యంతో మాట్లాడనివ్వకుండా వంశీ, కొర్సా లక్ష్మి అడ్డుపడుతున్నారని తెలిపారు. అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వెల్లడించారు. తన చావుకు బాధ్యులు వంశీ, కోర్సా లక్ష్మియే అని తెలిపారు. కాగా విషయం తెలుసుకున్న బూర్గంపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రత్తమ్మను పోలీస్​ స్టేషన్ కు తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఐటీసీ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story