12 ఏళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి.. (వీడియో)

by sudharani |
12 ఏళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో దేశంలో పలు ప్రాంతాల్లో పెరుగుతున్న కుక్కల దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోజురోజుకు తీవ్రం అవుతున్న ఈ కుక్కల దాడిలో కొంత మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్ర గాయాలకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఓ 12 ఏళ్ల బాలికపై కుక్కలు గుంపుగా వచ్చి దాడి చేశాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఘజియాబాద్‌లోని ఓ సొసైటీ క్యాంపస్‌లో 12 ఏళ్ల బాలికపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో బాలిక తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నించి కానీ అవి వీడకుండా గుంపుగా చుట్టుముట్టాయి. ఆ బాలిక పెద్దగా అరవడంతో దూరంగా వెళ్లినట్లే వెళ్లి మళ్లీ దాడి చేయడం ప్రారంభించాయి. అయితే.. అటుగా వెళ్తున్న ఓ డెలవరీ బాయ్ బైక్ ఆపి రావడంతో కుక్కలు పరారయ్యాయి. దీంతో ఆ పాప ప్రాణాపాయం నుంచి బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో.. నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed