ట్రాక్టర్ బోల్తా పడి ఆరుగురికి తీవ్ర గాయాలు..

by Kalyani |   ( Updated:2023-05-18 15:13:15.0  )
ట్రాక్టర్ బోల్తా పడి ఆరుగురికి తీవ్ర గాయాలు..
X

దిశ, గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని నేరల్ తాండ రోడ్డు సమీపంలో గురువారం ట్రాక్టర్ బోల్తా పడి ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలలోకి వెళితే.. దండగుల నరసవ్వ, శ్రీకాంత్, ఉప్పు హనుమంతు లకు తలపై తీవ్రమైన గాయాలు కాగా చిన్న సాయిలు, ముక్కు వద్ద నుంచి రక్తం కారి తీవ్ర గాయాలయ్యాయి, ఉప్పు సాయిలు కు భుజం వద్ద గాయం కాగా, జ్యోతికి వెన్నుపూస గాయమైంది. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కు తరలించడం జరిగిందని ఈఎంటీ సురేష్, పైలెట్ సంజీవులు తెలిపారు.

Advertisement

Next Story