ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్..

by Aamani |
ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్..
X

దిశ,తాండూరు రూరల్ : గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన కరన్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..జోర్ని వీరేశం ఇంటి వద్ద పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని రూ 33 వేల 250 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు.తాండూర్ మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన జోర్ని వీరేశం ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందంతో కలిసి ఆ ఇంట్లో సోదా చేయగా ఏడుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు గుర్తించామన్నారు.

అందులో పేకాట ఆడుతున్న వారిలో కొండ్ల నరేందర్,కులకర్ణి రాఘవేందర్, కురువ మల్లికార్జున, సల్వా నర్సింహులు,కుమ్మరి జగదీష్, బుట్ట వినోద్,లు పేకాట ఆడుతున్నట్లు గుర్తించమన్నారు. జోర్ని వీరేశం పరారీలో ఉన్నట్టు సమాచారం. పేకాట ముక్కలతోపాటు రూ. 33 వేల 250 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.రానున్న దసరా,దీపావళి పండుగల సందర్భంగా కొంతమంది పేకాట విచ్చల విడిగా ఆడేందుకు తెరలేపుతున్నారని, వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఎక్కడ పేకాట ఆడిన తమకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.

Advertisement

Next Story

Most Viewed