కాలిఫోర్నియాలో జెట్ విమానం కూలి ఆరుగురు మృతి

by Javid Pasha |
కాలిఫోర్నియాలో జెట్ విమానం కూలి ఆరుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ జెట్ విమానం కుప్పకూలడంతో అందులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఫ్రెచ్ వ్యాలీ విమానాశ్రయం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని రివర్ సైడ్ కౌంటీ షెరీఫ్ అధికారులు తెలిపారు. ఈ జెట్ విమానం శనివారం ఉదయం లాస్ వెగాస్ లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగినట్లు వారు తెలిపారు. ఇక ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed