- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సంచలనం రేపుతోన్న శిరీష మరణం..
దిశ, పరిగి : వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ గ్రామ శివారులోని నీటి గుంటలో యువతి మృతదేహాన్ని ఆదివారం గ్రామస్తులు కనిపెట్టారు. గ్రామస్తులు, పోలీసులు కథనం ప్రకారం నీటి గుంటలో లభ్యమైన యువతి మృతదేహం గ్రామానికి చెందిన జంగయ్య కూతురు జట్టు శిరీష (19) అని గుర్తించారు. వెంటనే కుటుంబీలకు సమాచారం ఇవ్వగా కాళ్లాపూర్ గ్రామానికి చెందిన జట్టు శిరీష నిన్న రాత్రి ఇంటి నుంచి వెళ్లి పోయిందని కుటుంబీకులు తెలిపారు. నీటి గుంటలో లభించిన శిరీషను గుర్తుతెలియని దుండగులు సృడ్రైవర్ తో కళ్లలో పొడిచి, గొంతుకోసి హత్య చేసి నీటి గుంటలో పడవేసినట్లు మృదేహం పై ఆనవాళ్లు ఉన్నాయి.
సంఘటనా స్థలానికి పరిగి డిఎస్పీ కరుణా సాగర్ రెడ్డి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబీకులను వివరాలు అడుగగా శిరీష తమ్ముడు శ్రీను అక్క అన్నం వండటం లేదని బావ అనిల్ కు ఫోన్ చేశాడు. బావ అనిల్ వచ్చి శిరీషను మందలించాడు. దీంతో కొంత గొడవ జరిగింది. గొడవ జరగడంతో శిరీష ఇంట్లోంచి వెళ్లి పోయిందని కుటుంబీకులు తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన శిరీష గ్రామ సమీపంలోని గోనె మైసమ్మ ఆలయంలోని నీటి కుంటలో ఎలా పడి చనిపోయిందో తెలియదన్నారు. కాగా శిరీషను బావ హత్య చేసి ఏమీ తెలియనట్లు నటిస్తున్నారంటూ గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శిరీష మృతికి కారుకులు ఎవరనేది విచారణ చేపట్టి నింధితులను కఠినంగా శిక్షస్తామని పోలీసులు తెలిపారు.