శృంగార ఆఫర్.. ఏ అమ్మాయితోనైనా రూ.1000లకే సెక్స్.. మెయిన్ రోడ్డుపై బోర్డు ఏర్పాటు (వీడియో)

by Nagaya |
శృంగార ఆఫర్.. ఏ అమ్మాయితోనైనా రూ.1000లకే సెక్స్.. మెయిన్ రోడ్డుపై బోర్డు ఏర్పాటు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : వ్యాపార అభివృద్ధి కోసం షాపింగ్ మాల్స్ నిర్వహకులు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటారు. డిస్కౌంట్లు పెడుతుంటారు. ఒకటి కొంటే రెండు ఫ్రీ అంటారు. ఇలా బిగ్ సేల్, మెగా ఆఫర్ అంటూ కొనుగోలు దారులను ఆకర్షిస్తుంటారు. ఇదంతా సేల్స్ పెంచుకోవడానికే వాళ్లంతా చేస్తుంటారు. అయితే ఓ లాడ్జి నిర్వహకులు పెట్టిన శృంగార ఆఫర్ అందరినీ విస్మయానికి గురి చేయడంతోపాటు మహిళల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. ఇంతకూ వాళ్లేం ఆఫర్ పెట్టారంటే..

చెన్నైలోని లిటిల్ మౌంట్‌లో నడి రోడ్డుపై ఓ లాడ్జి నిర్వహకుడు పెద్ద డిజిటల్ బోర్డును ఏర్పాటు చేశాడు. బ్లాక్ కలర్ బోర్డుపై రెడ్ అక్షరాలతో మిరుమిట్లు గొలుపుతున్న ఆ బోర్డు ఆ దారిన వెళ్లే ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. అది నగరంలో మెయిన్ రోడ్డు కావడంతో వాహనాలు అత్యధికంగా తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ మహిళ కారులో అటుగా వెళ్తుండగా ఎదురుగా ఆమెకు ఆ లాడ్జి వాళ్లు ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డు కనిపించింది. దానిపై ఉన్న ఆఫర్‌ను చూసి ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే దానిని వీడియో, ఫొటోలు తీసి ట్వీట్ చేసింది. వెంటనే చర్యలు తీసుకోవాలని చెన్నై పోలీసులను కోరింది. చెన్నైలో ఇలాంటి బూతు ప్రకటనలా అంటూ ప్రశ్నించింది. వెంటనే స్పందించిన పోలీసులు రోడ్డుపై ఉన్న ఆ డిజిటల్ బోర్డును తొలగించి చేతులు దులుపుకున్నారు. ఇంతకూ ఆ బూతు ప్రకటన ఏంటనేగా మీ డౌట్.. ''రూములో దిగండి.. ఏ అమ్మాయితోనైనా 1000 రూపాయలకే శృంగారం చేయండి'' అంటూ ఆ లాడ్జి నిర్వహకులు తమ కస్టమర్లకు బహిరంగంగా శృంగార ఆఫర్‌ను ప్రకటించి సంచలనానికి తెరలేపారు. ఇదే అక్కడ రచ్చకు దారి తీసింది.

Advertisement

Next Story

Most Viewed