సిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం..

by Mahesh |   ( Updated:2023-02-14 05:02:22.0  )
సిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్ గ్రామ శివారులోని సిరిసిల్ల- సిద్దిపేట రహదారిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పద్మ నగర్‌లో పెట్రోల్ బంక్ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న స్కూటీని లారీ ఢీ కొట్టింది. దీంతో స్కూటీపై సిరిసిల్లలోని సంజీవయ్య నగర్‌కు చెందిన మహేందర్, బిట్ల అఖిల్ అనే ఇద్దరు యువకులు ఉన్నారు.

వీరు సిరిసిల్లకు వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో పాటు కొద్ది దూరం స్కూటీని ఈడ్చికేల్లగా, టైర్ల కింద మహేందర్ నగిలిపోయారు. అఖిల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. మహేందర్ అక్కడికక్కడే మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న అఖిల్‌ను స్థానికులు సిరిసిల్ల దవాఖానకు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు చేపట్టారు. కాగా పద్మనగర్ శివారులోని మూలమలుపు ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండడం పరిపాటిగా మారింది. ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి : హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. 3 బస్సులు అగ్నికి ఆహుతి

Advertisement

Next Story