వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం.. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ పూర్తి

by GSrikanth |   ( Updated:2022-12-25 13:26:49.0  )
వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం.. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ పూర్తి
X

దిశ, వెబ్‌డెస్క్: వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డితో పోలీసులు నిర్వహించిన సీన్ రీకన్‌స్ట్రక్షన్ పూర్తి అయింది. శనివారం రాత్రి 9 గంటల సమయంలో వనస్థలిపురంలోని హస్తినాపురం మిస్టర్ టీ పాయింట్ నుంచి మన్నేగూడలోని వైశాలి ఇంటివరకు పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. అనంతరం నవీన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో వైశాలిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు నవీన్ రెడ్డి ఒప్పుకున్నారు.

కాగా, తెలంగాణలో సంచలనంగా రేపిన వైశాలి కిడ్నాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం నవీన్‌రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు. రంగారెడ్డి కోర్టు అనుమతితో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ పూర్తి చేశారు. అనంతరం నవీన్‌రెడ్డిపై గతంలో ఉన్న కేసుల వివరాలు ఆరాతీస్తున్నారు. కిడ్నాప్ కేసులో A1 నిందితుడు నవీన్ రెడ్డిని విచారించేందుకు 8 రోజులు పోలీస్ కస్టడీకి కావాలంటూ ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇబ్రహీంపట్నం కోర్టు ఒకే రోజు కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో పోలీసులు జిల్లా కోర్టును ఆశ్రయించగా 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. శనివారం చర్లపల్లి జైలు నుంచి నిందితుడు నవీన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని, ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌కి తరలించి విచారిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed