గ్రామ పంచాయతీ బిల్లులు రాక సర్పంచ్ ఆత్మహత్య

by Mahesh |
గ్రామ పంచాయతీ బిల్లులు రాక సర్పంచ్ ఆత్మహత్య
X

దిశ, నారాయణఖేడ్: ఇంట్లో దూలం కు ఉరి వేసుకుని సర్పంచ్ మృతి చెందిన సంఘటన సిర్గాపూర్ మండలం పెద్ద ముబారక్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.కుటుంబాస్తులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్ద ముబారక్ సర్పంచ్ ఆసం దిగంబర్ (50) తన ఇంట్లో దూలం కి గురువారం ఉదయం ఉరి వేసుకుని మరణించారు. ఆయన గ్రామ పంచాయతీ బిల్లులు రాక అప్పు అధికంగా ఉండడంతో పాటు ఆరోగ్యం సహకరించకపోవడంతో సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఆయనకు భార్య ఉంది. ఆయనకు ఎలాంటి సంతానం లేదు. ఆనారోగ్యం, అప్పుల బాధతో మృతి చెందారని తెలిపారు.

ఫిబ్రవరి 1వ తేదీన సంగారెడ్డి కలెక్టర్ శరత్ కుమార్, డీపీఓ సురేష్ మోహన్, స్థానిక ఎంపీడీవో సుజాతకు సర్పంచ్ పదవికి రాజీనామా చేయడంతో వారు ఆమోదించలేదు. వారం రోజుల క్రితం దిశతో మాట్లాడుతూ.. నాకు పిడుసు రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాను. అందులో గ్రామపంచాయతీకి పెట్టిన డబ్బులు వడ్డీలు కట్టలేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అన్నారు. పేరుకే పెద్ద ముబారక్ పూర్‌గాని చిన్న పంచాయతీతో నిధులు లేక చేసిన అప్పులు తీర్చలేక అందుకోసమే కలెక్టర్‌కు రాజీనామా పత్రం అందజేసిన అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed