- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో చోరీ
by Sridhar Babu |
X
దిశ, వెబ్డెస్క్ : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఓ భక్తుడు కానుకగా ఇచ్చిన బంగారు నగను ఉద్యోగి కాజేశాడు. మాస పూజల కోసం ఈ నెల 15న సాయంత్రం ఆలయం తెరిచారు. ఓ భక్తుడు స్వామివారికి 10.95 గ్రాముల బంగారు బ్రాస్‌లెట్‌ను సమర్పించాడు. ఈ నగ హుండీలో వేయగా కన్వేర్ బెల్టు ద్వారా హుండీ వద్దకు వస్తున్న క్రమంలో రెజీ కుమార్ అనే ఉద్యోగి దానిని పక్కకు నెట్టి అక్కడ ఉన్న చెత్తలో పడేలా చేశాడు.
అనంతరం దానిని తీసుకుని తన జేబులో వేసుకున్నాడు. ఈ తతంగం అంతా అక్కడ సీసీటీవీలో రికార్డయ్యింది. దీంతో రెజి కుమార్ ఉన్న గదిని తనిఖీ చేయగా దిండు కింద లభ్యమైంది. తక్షణమే స్పందించిన విజిలెన్స్ అధికారి ఆ ఉద్యోగిపై కేసు నమోదుచేసి పోలీసులకు అప్పగించారు. కాగా మంగళవారం రాత్రి ఆలయాన్ని మూసివేయనున్నారు.
Advertisement
Next Story