- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సలేశ్వరం జాతరలో అపశృతి..
దిశ, అచ్చంపేట : నల్లమల్ల తట్టు ప్రాంతంలో కొనసాగుతున్న సలేశ్వరం జాతరలో అపశృతి చోటు చేసుకుంది. జాతరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. బుధవారం సాయంత్రం వరకు భక్తుల రద్దీ పెరగడంతో సుమారు వందమీటర్ల దూరం వరకు బారులుతీరి భక్తులు లింగమయ్య దర్శనం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఏడాది వివిధ ప్రమాదాలతో సలేశ్వరం వద్ద భక్తులు మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అదే విధంగా ఈ ఏడాది కూడా జాతరలో అపశృతి చోటుచేసుకుంది. సలేశ్వరం జాతర రెండవ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో నాగర్ కర్నూల్ జిల్లా ప్రాంతానికి చెందిన చంద్రయ్య అనే వ్యక్తి ఊపిరి ఆడక మృతి చెందాడు. కాగా మృతదేహాన్ని గురువారం ఉదయం 10 గంటల వరకు పోలీసులు అతికష్టం మీద అటవీశాఖ అధికారుల సహకారంతో రాంపూర్ పెంట వద్దకు చేర్చారు. అక్కడ నుండి 108 అంబులెన్స్ ద్వారా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరో సంఘటనలో ముంబాయి ప్రాంతానికి చెందిన విజయ అనే గృహిణి రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ప్రాంతానికి చెందిన కుటుంబ సభ్యులతో కలిసి సలేశ్వరం దైవదర్శనానికి గురువారం వెళ్లారు. సలేశ్వర సమీపానికి వెళ్లేసరికి మహిళకు హార్ట్ ఎటాక్ రావడంతో ఆమెను అచ్చంపేట ఆస్పత్రికి చేర్చి వైద్య పరీక్షలు అందించారు. అనంతరం హైదరాబాద్ కు తరలించారు.
పౌర్ణమి రోజున సలేశ్వర లింగమయ్యను దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. దీంతో రెండో రోజైన గురువారం లక్షలాది మంది భక్తులు లింగమయ్యను దర్శించుకున్నారు. అంత మంది భక్తులకు తగిన ఏర్పాట్లు లేకపోవడంతో అధికార యంత్రాంగం పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దర్శనం కాకుండానే...
అటవీ శాఖ అధికారులు టోల్గేట్ పేరుతో వందల రూపాయలను వాహనదారుల నుంచి వసూలు చేసి కనీసం ఇతర సౌకర్యాలు కూడా చేపట్టలేదని వారిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల తాకిడి అధికంగా ఉండడం వల్ల చేసేది లేక కంట్రోల్ చేయడంలో పోలీసులు చేతులు ఎత్తేశరని భక్తులు ఆరోపిస్తున్నారు. ఒత్తిడి అధికంగా ఉండడం వలన దర్శనం కాకుండానే భక్తులు వెను తిరుగుతున్నామని ఇది ముమ్మాటికి అధికారుల వైఫల్యమే అని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులను అంచనా వేయడంలో జిల్లా యంత్రాంగం కావాలని నిర్లక్ష్యం చేశారని విమర్శలు వెళ్లి వెతుకుతున్నాయి.