- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాళ్ల వాగు హత్య కేసును ఛేదించిన పోలీసులు..
దిశ, రామకృష్ణాపూర్/మంచిర్యాల: రామకృష్ణాపూర్‌లో కొత్త తిమ్మాపూర్ శివారు రాళ్ల వాగులో ఈ నెల 7న జరిగిన హత్యలో మిస్టరీని పోలీసులు ఛేదించారు. సోమవారం మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో డీసీపీ సుధీర్ రామ్నాథ్ కెకాన్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ హత్య కేసులో మధ్యప్రదేశ్ ఆవ గ్రామానికి చెందిన రాకేష్‌గా గుర్తించారు. మందమర్రి సీఐ అద్వర్యం హత్యను ఛేదించేందుకు ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి గద్దె రాగడి, మంచిర్యాల, నస్పూర్ ప్రాంతాల సీసీ కెమెరాల ఆధారంగా మిళింద్ రామ్టేకి, వికాస్ రంటేకె, విశ్వాస్ కృష్ణ కుమార్ లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ముగ్గురు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని, పాత కక్ష్యల కారణంగా పథకం ప్రకారమే.. ఒక ద్విచక్ర వాహనాన్ని దొంగిలించి, రాకేష్ కు మద్యం ఇచ్చి హత్య చేసి ప్రమాదంగా చిత్రికరించినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మందమర్రి సీఐ ప్రమోద్ రావు, ఎస్సై అశోక్, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని డీసీపీ సుధీర్ రామ్నాథ్ కెకాన్ అభినందించారు.
ఇవి కూడా చదవండి : పోలీసుల పట్ల దురుసు ప్రవర్తన.. వ్యక్తికి జైలు శిక్ష
- Tags
- murder case