పేకాట స్థావరంపై పోలీసుల దాడి

by Shiva |
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
X

దిశ, భీమిని: కన్నెపల్లి మండల కేంద్రంలోని సుర్జాపూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై సోమవారం పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. గ్రామంలో బెట్టింగ్ తో పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి పేకాట ఆడుతున్న స్థావరంపై దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లు వివరాలను వెల్లడించారు. కుమ్మరి ఆకాష్, టకేరా మారయ్య, కొఠారి లింగయ్య, బాసిక హనుమంతు, మేదం లచ్చన్న, బోరుకుంట లింగన్న, గోలేటి రాజు, టకేరా సత్తయ్య, చెండే జగన్, మంగలి మల్లేష్, కాసెట్టి చందు, మెర్పకా ప్రశాంత్ అను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.8,300 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed